హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): వరంగల్లో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుక సందర్భంగా మంగళవారం ఆర్టీసీతో మహిళా సంఘాలకు అద్దె బస్సుల ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అద్దె బస్సులపై ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు టెండర్ల ద్వారా అద్దె బస్సులు నడిపిన ప్రైవేటు వ్యక్తులతో పాటు మహిళా సంఘా లు సైతం అద్దె బస్సులను నడుపనున్నాయి.