12-02-2025 04:53:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అడిషనల్ జూనియర్ జడ్జి అజయ్ కుమార్ ను నూతనంగా నియమించబడ్డ ఏజీపీ ఆసిఫ్ అలీతో పాటు న్యాయవాదులు బుధవారం కలిశారు. జడ్జికి పుష్పగుచ్చం అందించారు. పేదలకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రమణ మహమ్మద్ రాజరత్నం తదితరులు ఉన్నారు.