calender_icon.png 25 October, 2024 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీభూమి కబ్జాపై రగడ

25-10-2024 01:24:02 AM

  1. సర్వే చేస్తుండగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ
  2. గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీభూమి అక్రమణపై చర్యలు
  3. కామారెడ్డి జిల్లాలోని గౌరారం గ్రామంలో ఘటన

కామారెడ్డి,అక్టోబర్ 24 (విజయక్రాంతి): అటవీభూమి కబ్జాపై గత కొద్ది రోజులుగా రగడ నడుస్తోంది. సుమారు 50 ఎకరాల అటవీభూమిని గిరిజన తండాకు చెందిన పలువురు కొల్లగొట్టి తమ గ్రామ పరిధిలోని భూమిని కబ్జా చేశారని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామస్థులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం అటవీ అధికారులతోపాటు రెవెన్యూ అధికా రులు కలిసి గౌరారం శివారులోని అటవీప్రా ంతాన్ని జాయింట్ సర్వే నిర్వహించేందుకు వ చ్చారు.  అధికారుల ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, ఇటుకలతో దాడు లు చేసుకున్నారు. దీంతో స్థానికులు పోలీసు లకు సమాచారం అందించారు. గౌరారం గ్రా మస్థులకు, ఓ గిరిజన నాయకుడి సోదరుల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు తెలిపా రు.

అధికారుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న గాంధారి ఎస్సై ఆంజనేయులు ఇరువర్గాలతో మాట్లాడి శాంతియుతంగా సమస్యను పరిష్కారించుకో వాలని సూచించారు. అధికారులు జాయింట్ సర్వే నిర్వహిస్తుండగా తమపై దాడికి పాల్పడ్డా రని గౌరారం గ్రామస్థులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హమీ ఇచ్చారు.