calender_icon.png 27 December, 2024 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశాల.. గోస..

03-12-2024 05:29:30 PM

చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నాం..

అనేక అవస్థలు పడుతున్నాం..

టార్గెట్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు..

ఆశ వర్కర్ల ఆవేదన..

రామాయంపేట: చాలు చాలని వేతనాలతో తమను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా తాము ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తూ గర్భిణులు బాలింతలకు గత ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిక్స్ అమౌంట్ ప్రయత్నం చేస్తాం అంటూ ప్రకటనలు చేశారు తప్ప అమలులో మాత్రం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అసెంబ్లీలో ఖచ్చితమైన ప్రకటన చేయాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు ఇచ్చే వేతనంతో పాటు అదనంగా వేయాలని సంఘం నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. హామీ ఇచ్చినా ఫలితం గత సంవత్సరం గడిచిన  శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చేత ప్రభుత్వం అనేకసార్లు చేపించుకున్నప్పటికీ తమకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కులపై ఒత్తిడి మానుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. తమ సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించకుంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని సిఐటియు నాయకురాలు బాలమణి హెచ్చరించారు.