calender_icon.png 25 November, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీహబ్ ఎదుట అగ్రిటెక్ బాధితుల ఆందోళన

25-09-2024 03:47:06 AM

శేరిలింగంపల్లి,  సెప్టెంబర్ 24: జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో పాటు తమ పేరున లోన్లు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు మంగళవారం ఆందోళ నకు దిగారు. వివరాలు.. ఇటీవల ఆదిత్య దేశ్‌పాండే అనే వ్యక్తి రాయదుర్గం టీహబ్ లో ‘అగ్రిటెక్ ల్యాబ్ టూ ల్యాబ్’ అనే ఫర్టిలైజర్ కంపెనీని నెలకొల్పాడు. ఈ కంపెనీ రైతులకు ఫర్టిలైజర్స్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసేది.

ఇందుకు గాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాకు ఒక మెయిన్ డీలర్, మండలానికో డీలర్, సబ్ డీలర్లను నియచించుకుంది. డీలర్‌షిప్‌కు గాను రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.లక్ష చొప్పున వసూల్ చేసింది. అలాగే వారికి సంబంధించిన ఆధార్, పాన్‌కార్డు ఇతర డాక్యుమెంట్లు తీసుకుని వారి పేరున లక్షలాది రూపాయల లోన్లు తీసుకుంది.

విష యం ఆలస్యంగా తెలుసుకున్న ఉద్యోగులు ఇటీవల సంస్థ ఎండీ ఆదిత్య దేశ్‌పాండేను నిలదీయగా.. అతడు ఉన్నఫళంగా కంపెనీకి తాళం వేసి ఉద్యోగులు ఎవరూ రావద్దు అంటూ బోర్డు పెట్టి పలాయించాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఉద్యోగులు మూడు నెలల క్రితం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.