calender_icon.png 19 January, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెబ్రోన్ చర్చి వద్ద ఆందోళన

01-09-2024 01:29:16 AM

ట్రస్ట్, సొసైటీ సభ్యుల మధ్య వాగ్వాదం

ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

ముషీరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజక వర్గంలోని గాంధీనగర్ గోల్కొండ చౌరస్తా వద్ద గల హెబ్రోన్ చర్చి వద్ద శనివారం రాత్రి ట్రస్ట్ సభ్యులు అక్రమంగా చర్చిలోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చర్చికి సంబంధించిన ట్రస్ట్, సొసైటీ సభ్యుల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ అంశం న్యాయస్థానం లో ఉండగా సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రస్తుతం చర్చి కొనసాగుతోం ది.

అయితే కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ట్రస్ట్ సభ్యులు అక్రమంగా చర్చిలోని సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారు. చర్చి గేట్లను విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు యత్నిం చారు. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రస్ట్, సొసై టీ సభ్యులను అడ్డుకొని కొంతమందిని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ బాబు, ఇన్‌స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య నేతృతంలో చర్చి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త సద్దుమనిగింది.