రాజీవ్ కాంప్లెక్స్ వ్యాపారుల ఆవేదన
బెల్లంపల్లి (విజయక్రాంతి): గత 60 ఏళ్ల నుండి రాజీవ్ కాంప్లెక్స్ లో దుకాణాలు నడుపుకున్న తమను అగ్రిమెంట్ల కోసం కొంతమంది నాయకులు వేధించి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేశారని రాజీవ్ కాంప్లెక్స్ వ్యాపారులు ఆవేదన చెందారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ.. స్థానికంగా తామే దుకాణాలు నిర్మించుకుందామని చెప్పారు. సొంత డబ్బులతో నిర్మించుకున్న దుకాణాలకు అగ్రిమెంట్లు చేయాలని వేధించారని, తమ దుకాణాలు మూసి వేయించడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కోర్టు నుండి తమకు స్టే వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా తనకు దుకాణాలు కేటాయించాలని 9 దుకాణాలకు సంబంధించిన వ్యాపారులు వేడుకున్నారు.