మంగళూరు: 77వ సీనియర్ జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ మరోమారు మెరిసింది. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన అగర్వాల్ గురువారం డబుల్ బొనాంజా అందుకుంది. తొలుత మహిళల 800 మీటర్ల ఫ్రీస్టుల్ విభాగంలో స్వర్ణం నెగ్గిన వృత్తి 200 మీటర్ల బటర్ ఫ్లు ఈవెంట్‌లో రజతం నెగ్గగా.. హాసిక రామచంద్ర ( 2 నిమిషాల 21.16 సెకన్లు) స్వర్ణం చేజెక్కించుకుంది. పురుషుల 4 x 100 మెడల్ రేస్‌లో తమిళ నాడుకు చెందిన నాథెల్లా, సురేష్, రోహిత్, దినేష్‌లతో కూడిన బృందం స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్‌లో అనీశ్ పసిడి గెలుచుకున్నాడు.