18-03-2025 05:21:26 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మందమర్రి ఏరియా కల్యాణి ఖని గ్రూపు ఏజెంట్ గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు మంగళవారం కాసిపేట 1 ఇంక్లైన్ గని ని సందర్శించారు. ఏజెంట్ రాంబాబుని కాసిపేట గని మేనేజర్ భూసంకరయ్య, రక్షణ అధికారి నిఖిల్ అయ్యర్, ఫిట్ ఇంజనీర్ మధుకర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, సర్వేయర్ ప్రభాకర్, ఖాన్, రాజ్ కుమార్, ఇంజనీర్ రామకృష్ణ, బన్న లక్ష్మన్ దాస్ పాల్గొని శాలువాతో సన్మానించి, జ్ఞాపికను(మొక్కను) అందజేశారు. అనంతరం ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ... కాసిపేట అధికారులు, ఉద్యోగుల కు అందుబాటులో ఉండి ఉత్పత్తి, రక్షణ, సంక్షేమంపై దృష్టి పెట్టుతానని, మీ ఆత్మీయత మరిచిపోలేనిదని అన్నారు.
అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఏజెంట్ రాంబాబును శాలువ, బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి బ్రాంచి ఇన్చార్జి చిప్ప నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్ బియ్యల వెంకట స్వామి, జాడి ఫోషం, రాజేందర్, అశోక్, రంజిత్, రాజన్న, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.