పారిస్ ఫ్యాషన్ వీక్‌కు బాలీవుడ్ తారలు అలియా భట్, ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. ఇద్దరు నటులు ఫ్యాషన్ ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‌పై కనిపించారు. వీరిద్దరి స్టులిష్ లుక్ అభిమానులకు నచ్చగా.. వీటన్నింటి మధ్య 86 ఏళ్ళ అమెరికన్ నటి లుక్ వైరల్‌గా మారింది. ఆమె ముందు ఎవరూ నిలబడలేకపోయారు.
ఆమె ఎవరో కాదు.. ప్రసిద్ధ నటి జేన్ ఫోండా. ఆమె రెండుసార్లు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు. రిటైర్‌మెంట్ ప్రకటించి హాయిగా రెస్ట్ తీసుకునే వయసులో ఈ బ్యూటీ ర్యాంప్‌పై నడవడంతో సంచలనం సృష్టించారు.
మెరిసే నక్షత్రాలతో అలంకరించబడిన ట్రెంచ్ కోట్ ధరించారు. దానిని ధరించి తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు. జెన్ లోరియల్ ఫ్యాషన్ షో కోసం మెటాలిక్ ట్రెంచ్ కోట్‌ని ఎంచుకున్నారు. ఇది సీక్విన్ స్టార్‌లతో వివరాలను కలిగి ఉంది. పాకెట్‌లను కూడా కలిగి ఉంది. దీన్ని ధరించడం వల్ల కోటుతో పాటు ఆమె ముఖం కూడా మెరిసిపోయింది.
తల నుంచి కాలి వరకు చాలా గ్లామరస్‌గా కనిపించేలా స్టుల్‌గా రెడీ అయ్యారు. నటి ఫుల్ స్లీవ్ ట్రెంచ్ కోట్‌పై చాలా వెండి నక్షత్రాలు లైన్‌లలో అమర్చారు. అంతేకాకుండా దాని స్లీవ్‌లపై బెల్ట్ లాంటి డిజైన్‌ను కూడా కలిగి ఉంది. అయితే కోట్‌లో గోల్డెన్ రంగులో బటన్లు కూడా ఉన్నాయి. ఆమె బ్లాక్ మేజోళ్ళతో కిల్లర్ లుక్‌లను చూపించారు.