calender_icon.png 30 October, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్ సేనకు ఎదురుందా?

02-08-2024 12:11:33 AM

కొలంబో: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా నేటి నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. నేడు కొలంబో వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. లంకను వైట్‌వాష్ చేసిన మన కుర్రాళ్లకు తోడుగా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. అయితే వికెట్ కీపర్‌గా పంత్, కేఎల్ రాహుల్‌లో ఎవరు చోటు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారిం ది. ఒకవేళ అదనపు బ్యాటర్ అవసరమనుకుంటే రాహుల్ కూడా తుది జట్టులో ఉండే అవకాశముంది. ఓపెనర్లుగా రోహిత్, గిల్ వచ్చే చాన్స్ ఉంది.

వన్‌డౌన్‌లో కోహ్లీ.. ఆ తర్వాత శ్రేయస్, పంత్, రాహుల్ రానున్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో దూబే లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిని ఎంపిక చేయొచ్చు. అర్ష్‌దీప్, ఖలీల్, హర్షిత్, సిరాజ్‌లలో ముగ్గురు పేసర్లు.. సుందర్ స్పిన్నర్‌గా ఉండొచ్చు. మరోవైపు ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక కనీసం వన్డే సిరీస్ లోనైనా నెగ్గి స్వదేశంలో పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అసలంక సారథ్యంలోని లంక జట్టులో నిసాంక, కుషాల్, కమిందు బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.