calender_icon.png 20 November, 2024 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మగవారికి వ్యతిరేకంగా..

10-09-2024 01:03:53 AM

నిరుడు తమిళంలో ‘మార్క్ ఆంటోనీ’తో హిట్ కొట్టింది రీతూవర్మ. ప్రస్తుతం ‘స్వాగ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాణి మింజామర రుక్మిణిదేవిగా కనిపించనుంది. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘రాజ రాజ చోర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నదే ‘స్వాగ్’ చిత్రం. అక్టోబర్ 4న విడుదల కానుందీ సినిమా. ‘స్వాగ్’లో స్త్రీ పక్షపాతిగా మగవారికి వ్యతిరేకంగా కత్తి దూయనుంది రీతూ. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి పంచుకుంటూ... ‘మగవాడంటేనే పగవాడు.. వాడి ఉనికిని ఉండనిస్తామా..’ అంటూ పవర్‌ఫుల్ డైలాగులు చెబుతోందీ అమ్మడు. ఇంకా తన కెరీర్, ప్రాజెక్టుల గురించి చెప్తూ.. “కిందటేడాది ‘మోడ్రన్ లవ్ చెన్నై’ వెబ్ సిరీస్‌లో మల్లికగా కనిపించా.

ఇది తమిళంలో విడుదలైంది. తమిళంలో విక్రమ్ హీరోగా వస్తున్న ‘ధ్రువ నచ్ఛిత్రం’ చాప్టర్‌ెే1లో అనుపమగా నటిస్తున్నా. ఈ సినిమా నవంబర్‌లో రానుంది. తెలుగులో ‘వరుడు కావలెను’ తర్వాత నా సినిమాలు లేవు. ‘స్వాగ్’తో ఆ లోటు తీరనుంది. మా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని భోపాల్. కానీ, హైదరాబాద్‌లో నేను పుట్టి పెరిగాను. మల్లారెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. విహారయాత్రలంటే మహా ఇష్టం. ఎక్కువ సమయాన్ని ట్రిప్పుల్లోనే గడిపేస్తుంటా. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి ఆహారాన్ని ఆస్వాదించడటమంటే చాలా ఇష్టం. ఇంకా నేను చీరకట్టుకు పెద్ద ఫ్యాన్’ అంటూ తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.