calender_icon.png 5 January, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఫ్గానిస్థాన్ ఎదురీత

04-01-2025 12:01:19 AM

జింబాబ్వేతో రెండో టెస్టు

బులవాయో: సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జింబాబ్వే పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. రహమత్ షా (18), జియా ఉర్ రెహమాన్ క్రీజులో ఉన్నారు. ముజరబానీ 2 వికెట్లు తీయగా.. సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (165 బంతుల్లో 75) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సికందర్ రజా (104 బంతుల్లో 61) అర్థసెంచరీతో రాణించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. అహ్మద్‌జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.