- మహిళల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- 41 రోజుల పాటు సాగనున్న పొట్టి ప్రపంచకప్
- డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి భారత్
- ఈ టోర్నీలో మలేసియా, సమోవా జట్లు తొలిసారి బరిలోకి దిగుతున్నాయి.
- అండర్-19 మహిళల విభాగంలో జరుగుతున్న రెండో టీ20 ప్రపంచకప్
మచ్చల పులిలా గాండ్రించాలె..
నల్లమబ్బులా కమ్మేయాలె
ప్రత్యర్థుల పని పట్టాలె
మైదానంలో సివంగుల్లా దూకాలె
ఆల్ ది బెస్ట్ టీమిండియా
విజయక్రాంతి ఖేల్ విభాగం :
దుబాయ్: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం వి డుదల చేసింది. 2025 జనవరి 18 నుంచి జరిగే ఈ టోర్నీకి మలేసియా ఆతిథ్యం ఇవ్వనుంది. 41 రోజుల పాటు సాగే ఈ సమరం లో 16 జట్లు పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా జట్లను విడదీశారు. భారత్ గ్రూ ప్ ఏలో వెస్టిండీస్, శ్రీలంక, మలేసియాలతో ఉంది. ఫిబ్రవరి 2 న ఫైనల్ (ఫిబ్రవరి 3 రిజర్వ్‌డే) జరగనుంది. తొలిసారి మహిళల అం డర్-19 జట్ల కోసం 2003లో ప్ర పంచకప్ స్టార్ట్ చేశారు. ఈ టోర్నీలో భారత మహిళలు ఫైనల్‌లో ఇంగ్లండ్ మహిళల్ని మట్టికరి పించి ట్రోఫీని ఒడిసిపట్టారు. మరి మనోళ్లు ఈ సారి ఏం చేస్తారో. గ్రూప్ దశలో భారత్ జనవరి 19న వెస్టిండీస్‌తో, 21న మలేసియాతో, 23న శ్రీలంకతో తలపడనుంది.
తొలిసారే..
మహిళల క్రికెట్ అండర్-19 స్థాయిలో తొలిసారి 2023లో వరల్డ్‌కప్‌ను ప్రవేశపెట్టారు. ఈ వరల్డ్‌కప్‌కు ఆనాడు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇవ్వగా.. గ్రూప్-డీలో ఉన్న భారత్ కప్పును కైవసం చేసుకుంది. ఈ సారి కూడా పోయిన ఏడాది లాగానే 4 గ్రూపులతో మ్యాచులను నిర్వహిస్తున్నారు. ఈ సారి భారత్ గ్రూప్-ఏలో ఉంది. 2003లో అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించిన షఫాలీ వర్మ ఇప్పుడు సీనియర్ టీమ్‌లో కొ నసాగుతోంది. మరి 2023లాగానే టీమిండి యా మరోమారు మ్యాజిక్ రిపీట్ చేసి విన్నర్‌గా నిలుస్తుందో లేదో చూడాలి. నాలుగు గ్రూపుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. రెండు గ్రూపులుగా ఉన్న సూపర్ ప్రతి గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్ చేరుకోనున్నాయి.
సూపర్ సిక్స్‌లో తడబడ్డ భారత్
2023 మహిళల అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. షఫాలీ వర్మ నేతృత్వంలోని యువ భారత్ గ్రూపు దశలో ఓటమన్నదే లేకుండా జైత్రయాత్రను కొనసాగించింది. కానీ సూపర్ సిక్సుకు వచ్చే సరికి మాత్రం ఓ మ్యాచ్ ఓడిపోయింది. సూపర్ సిక్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కంగారూల చేతిలో ఓటమిపాలైంది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచుల్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన షఫాలీ ఆర్మీ.. సూపర్ సిక్స్‌లో కూడా మొదటి స్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక సెమీస్‌లో న్యూజిలాండ్ మీద ఘన విజయం సాధించిన షఫాలీ సేన.. ఫైనల్లో ఇంగ్లండ్‌ను మరింత ఘోరంగా మట్టికరిపించి.. మొదటి సారి నిర్వహించిన మహిళల అండర్-19 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టుకోవడంలో సఫలం అయింది.
గ్రూపు- ఏ గ్రూపు-బీ గ్రూపు-సీ గ్రూపు-డీ
ఇండియా ఇంగ్లండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా
వెస్టిండీస్ పాకిస్తాన్ సౌతాఫ్రికా బంగ్లాదేశ్
శ్రీలంక ఐర్లాండ్ ఆఫ్రికా క్వాలిఫయర్ ఆసియా క్వాలిఫయర్
మలేసియా అమెరికా సమోవా స్కాట్లాండ్