20-02-2025 12:00:00 AM
ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో సైతం అజిత్‌కు అభిమాన గణం ఎక్కువే. అజిత్ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాల్లో ‘వాలి’ కూడా ఒకటి. ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ సాధించింది. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా అజిత్ కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ డ్యుయెల్ రోల్‌లో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుం ది. రెండు పాత్రల్లోనూ అజిత్ నటన చూసి తరించాల్సిందే. చాలా అద్భుతంగా నటించాడు. అజిత్‌కు ఏమాత్రం తీసిపోకుండా సిమ్రాన్ నటించింది. ఆ తరువాత అజిత్, సిమ్రాన్ కలిసి తెరపై కనిపించింది లేదు.
ఈ జంట తాజాగా అంటే పాతికేళ్ల తర్వాత తిరిగి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అజిత్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం రూపొందుతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో సిమ్రాన్‌కు ఓ స్పెషల్ క్యామియో రోల్ ఇచ్చారట. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం. అజిత్‌కు అధిక్ వీరాభిమాని అట. అజిత్ సినిమాల్లో ఆయనకు ‘వాలి’ చాలా ఇష్టమట. అందుకే తన చిత్రంలో ఆ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ ఎపిసోడ్‌ని డిజైన్ చేసి మరీ సిమ్రాన్‌ను చిత్రంలో తీసుకున్నారట.