21-04-2025 01:26:09 AM
సంస్మరణ సభలో పలువురు వక్తలు
ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : దివ్యాంగుల అవసరాలకు అనుగు ణంగా బైకులు, కార్లను ఆల్ట్రేషన్ చేసి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహనీయు లు అఫ్జల్ అలీ అని డిపరెంట్లి ఏబుల్ ఎం ప్లాయిస్ వెల్ఫేర్ అసోషియేషన్ తెలంగాణ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ హబీబ్ మియా అన్నారు.
ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో దివ్యాంగుల బైకు లు, కార్ల అల్ట్రేషన్ నిపుణులు అబ్జల్ అలీ సంస్మరణ సభను అసోషియేషన్ గౌరవాధ్యక్షులు ముక్కు నర్సయ్య అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా షేక్ హబీబ్ మియా మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం తన జీవితం చివరి వరకు సేవలు అందించాలని కొనియాడారు. భవిష్యత్‌లో కూడా వారి సేవలు దివ్యాంగులకు కొనసాగాలని కోరారు.
అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరబోయిన లక్ష్మయ్య, బొల్లం మహేం దర్, ఎం.సుబ్రహ్మణ్యం, ఎన్.కృష్ణకుమార్, మొహమ్మద్ అమీనుద్దిన్, తాజా ముల్ పా ల్గొని అఫ్జల్ అలీ సమాజం పట్ల చూపిన త్యాగ నిరతిని, సేవా గుణాన్ని కొనియాడా రు. ఈ సమావేశంలో ఆయన సతీమణి స య్యద్ ముజఫర్ సుల్తానా, కుమారుడు వా జిద్ అలీ, కూతుళ్ళు సానియా అఫ్జల్, సనా అఫ్జల్, సోదరులు జాందార్ అలీ, జబీర్ అ లీ, జరీనా బేగం, ఇతర కుటుంబ సభ్యులు, దివ్యాంగులు పాల్గొన్నారు.