calender_icon.png 2 October, 2024 | 3:58 AM

సినిమా చూశాక ఆడవాళ్లను ఇంకా గౌరవిస్తారు

02-10-2024 12:46:46 AM

హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబోలో రాబోతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్ కాగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు.. సినిమా విశేషాలను మంగళవారం విలేకరులతో పంచుకున్నారు. 

* శ్వాగ్.. అంటే శ్వాగణిక వంశానికి సుస్వాగతం అని అర్థం. పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇలా టైటిల్ షార్ట్‌గా పెట్టాం. ఇదొక వంశం కథ. మాతృ, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్, సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. మన వంశం, పెద్దలు, తాతల గురించి ఈ జనరేషన్ ఎందుకు తెలుసుకోవాలో చాలా చక్కగా చూపించాం. 

* నెనెప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను.. -సింగ క్యారెక్టర్ తప్ప, మిగతావన్నీ టఫ్‌గా అనిపించింది. నా కెరీర్‌లో గొప్ప చిత్రం అవుతుందనే నమ్మకముంది. 

* ఈ సినిమా చూశాక ఆడవాళ్లను ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. భవభూతి క్యారెక్టర్‌ను ఆడవాళ్లంతా ఇష్టపడతారు. ఇంకా నేను ఒక థ్రిల్లర్ చేస్తున్నా. గీతా ఆర్ట్స్‌లో ఓ ఎంటర్‌టైనర్ కూడా చేస్తున్నా.