calender_icon.png 27 December, 2024 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 మూగజీవాల మృత్యువాత

07-11-2024 12:25:51 AM

కేవోసీ విషవాయువులే కారణం: రైతుల ఆరోపణ

తమకు సంబంధం లేదన్న సింగరేణి

ఇల్లందు, నవంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో వెలువడే విషవాయువులతో బుధవారం 16 మేకలు మృతి చెందాయని పలువురు రైతులు ఆరోపించారు. జబ్బ వెంకటేశ్వర్లుకు చెందిన 30 మేకలను కాపరి ముసలయ్య ఓసీసీ పరిసర ప్రాంతంలో మేతకు తీసుకెళ్లాడు.

మధ్యాహ్న సమయంలో 16 మేకలు కనిపించలేదు. వాటిని వెతుక్కుంటూ వెళ్లగా ఓసీ ప్రాంతంలో మృతి చెంది కనిపించాయి. విషవాయువులతోనే మృతిచెందాయని ఆరోపిస్తూ వాటిని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, బోడు ఎస్సై శ్రీకాంత్ బాధిత రైతులు, అధికారులతో చర్చించారు. కాగా మేకల మృతితో తమకు సంబంధం లేదని సింగరేణి అధికారులు చెప్పారు.