calender_icon.png 17 November, 2024 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ పూర్తయ్యాకే ఆర్‌ఆర్‌ఆర్

10-08-2024 12:49:47 AM

లోక్‌సభలో కేంద్రమంత్రి గడ్కరీ

న్యూ ఢిల్లీ, ఆగస్టు 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి ఇచ్చాకనే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం చేపడతామని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ‘హైదరాబాద్‌కు రూ.17వేల కోట్ల విలువైన రింగ్‌రోడ్డు మంజూరు చేశాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తామే భూసేకరణ చేపట్టడంతో పాటు వ్యయంలో 50శాతం భరిస్తామని చెప్పింది. ప్రభుత్వం మారాక సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌పై మాతో చర్చించారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తిచేస్తే అంత త్వరగా పనులు ప్రారంభం అవుతాయి.  అలాగే విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ ఆరు లేన్లుగా విస్తరించాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డికోరారు. కోర్టు  కేసులు  క్లియర్ అయిన వెంటనే పనులు చేపడతాం’ అని తెలిపారు.