రెండో టెస్టులో జింబాబ్వే పరాజయం
బులవాయో: జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను అఫ్గానిస్థాన్ 1 కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్థాన్ 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 205 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (53) అర్థశతకం మినహా మిగతావారు విఫలమయ్యారు.
అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 7 వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. జియా ఉర్ రెహమాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 363 పరుగులకు ఆలౌటైంది. ఇస్మత్ ఆలమ్ (101) సెంచరీ చేయగా.. రహమత్ షా (139) శతకంతో చెలరేగాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు పరిమితమైంది. రషీద్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రహమత్ షా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నారు. టెస్టు సిరీస్‌తో పాటు వన్డే, టీ20 సిరీస్‌లను కూడా అఫ్గానిస్థాన్ కైవసం చేసుకోవడం విశేషం.