calender_icon.png 27 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠ పోరులో అఫ్గాన్ విజయం.. టోర్నీ నుంచి ఇంగ్లండ్ ఔట్

26-02-2025 11:33:20 PM

లాహోర్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లండ్(England) తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్(Afghanistan) 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా.. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండగా, ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇంగ్లండ్  బ్యాటర్లలో జో రూట్(Joe Root) 120 (111) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.