calender_icon.png 20 January, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫారీలకు ఆఫ్గన్ షాక్

19-09-2024 12:00:00 AM

షార్జా: సౌతాఫ్రికా జట్టుకు అఫ్గానిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని సాధించింది. తొలు త బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆఫ్గన్ బౌలర్ల ధాటికి 33.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. వియాన్ ముల్డర్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్గన్ బౌలర్లలో ఫరూకి 4 వికెట్లు, గజన్‌ఫర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. అజ్మతుల్లా (25 నాటౌట్), గుల్బదిన్ నైబ్ (34 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫోర్టున్ 2 వికెట్లు పడగొట్టాడు.