కింగ్స్‌టౌన్: టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. మెగాటోర్నీ ఆరంభం నుంచి నిలకడ కనబరుస్తున్న అఫ్గానిస్థాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన సూపర్ చివరి పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడా (డకవర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం)తో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. వర్షం అంతరాయం మధ్య బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (43; 3 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ (19 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు.
బంగ్లా బౌలర్లలో రిషాద్ హుసేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం వర్షం కారణంగా బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114గా నిర్ణయించగా.. 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లిటన్ దాస్ (54 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో పోరాడినా.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. తన్జీద్ (0), కెప్టెన్ నజ్ముల్ (5), షకీబ్ (0), మహ్ముదుల్లా (6) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. నవీన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మా జట్టు సెమీఫైనల్ చేరు తుందని నమ్మకంగా చెప్పిన వ్యక్తి బ్రియాన్ లారా. అంతటి దిగ్గజ ఆటగాడు మా మీద విశ్వాసం వ్యక్తం చేయడం గర్వంగా అనిపిం చింది. మెగాటోర్నీకి ముందు ఒక సారి లారాతో కలిసినప్పుడు మీ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పా. ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరడం మా కల. ఇప్పటికి అది నెరవేరింది. న్యూజిలాండ్‌పై విజయంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరు కొనసాగిస్తూ ఆస్ట్రేలియాపై గెలిచాం. ఈ అనుభూతిని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. చాలా ఆనందంగా ఉంది. స్వదేశంలో ఎందరికీ స్ఫూర్తి ఈ విజయం.
అఫ్గాన్ కెప్టెన్