ఫలించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చర్చలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టేందుకు ఏఈవోలు అంగీకరించారు. సర్వే అమలు పరిచే ప్రక్రియలో ఇబ్బందులుంటాయని తొలుత ఆందోళన వ్యక్తం చేసి న ఏఈవోలు సర్వేను చేపట్టలేదు. ఆ సర్వే తాము చేయలేమంటూ నిరసన వ్యక్తం చేస్తుండటంతో క్రాప్ డిజిటల్ సర్వేపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే తమ డిమాండ్లను పరిష్కరిస్తే సర్వే చేస్తామని వ్యవసాయ అధికారుల జేఏసీ సంఘాల నాయ కులు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైైర్మన్ వి.లచ్చిరెడ్డి, నాయకుడు కె.రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ పెద్దలతో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో ఏఈవోల డిమాండ్లపై జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి చర్చించారు.
ఆ సర్వేతో ఎదురయ్యే ఇబ్బందులను, ఏఈవోలు సర్వే ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాలను ఈ సందర్భం గా లచ్చిరెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావుకు వివరించారు. అన్ని అంశాలపై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు సానుకూలంగా స్పందించడంతో పాటు సమస్యల పరిష్కారాని సత్వరం చర్యలు తీసుకుంటామని ప్రక టించారు.
ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో రేపటి నుంచే సర్వే ప్రక్రియ ప్రారంభిస్తామని ఏఈవోలు ప్రకటించారు. లచ్చిరెడ్డి, రామకృష్ణతో పాటు రఘునందన్‌రావుతో చర్చలు జరిపిన వారి లో తెలంగాణ వ్యవసాయ అధికారుల జేఏ సీ సంఘాల నాయకులు, తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు వైద్య నాథం, శశిధర్‌రెడ్డి, రాష్ర్ట వ్యవసాయ విస్తరాణాధికారుల సంఘం నాయకులు వై. శ్రావణ్‌కుమార్, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.