హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఆర్‌అండ్‌బీ శాఖలో అసిస్టెం ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈఈ) ఆరేండ్ల నిరీక్షణకు తెరపడింది. శనివారం ఒకే రోజు 118 మంది ఏఈఈలకు డీఈఈలుగా పదోన్నతులను రాష్ర్ట ప్రభుత్వం కల్పించింది. దీంతో ఏఈఈలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
డీపీసీ ప్యానల్ నిబంధనల మేరకు 118 మందికి సర్కారు పదోన్నతులు కల్పించింది. త్వరలోనే డీఈఈ లుగా పదోన్నతి పొందినవారికి సర్కా రు పోస్టింగులు ఇవ్వనుంది. ఆర్‌అండ్‌బీలో అమలు చేస్తున్న సర్వీసు రూల్స్ అమలు ఆదర్శమని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.