calender_icon.png 31 October, 2024 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఈఈ తుది జాబితాప్రకటించాలి

04-07-2024 02:09:28 AM

ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డు 1180 పోస్టులకు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబి తా ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకు ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించకుండా కావాలనే ఆలస్యం చేస్తుందని మండిపడ్డారు. 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తయ్యిందని గుర్తుచేశారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కార ణంగా నిలిచిపోయిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ౭ నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదని విమర్శించారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలోఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాల ని డిమాండ్ చేశారు. ఏఈఈ  పరీక్ష రాసిన అభ్యర్థులు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. తుది జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వారికి అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వెంటనే టీజీపీఎస్సీ చైైర్మన్ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు