హైదరాబాద్: చంచల్ గూడ జైలు నుంచి నీటిపారుదల ఏఈఈ నిఖేష్ ను గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కస్టడీలోకి తీసుకొనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్ కుమార్ అరెస్టయ్యాడు. నిఖేష్ ను ఏసీబీ కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నిఖేష్ ను ఏసీబీ విచారించనుంది. నిఖేష్ రూ. వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలున్నాయి. నిఖేష్ బినామీ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది. నిఖేష్ సమీక్షంలో ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్లు తెరిచారు. ఇప్పటికే నిఖేష్ స్నేహితుడు బ్యాంకు లాకర్ లో సొత్తు స్వాధీనం చేసుకున్నారు. లాకర్ లో కిలోన్నర బంగారం, వజ్రా ఆభరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిఖేష్ లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముంది.