- 4 రోజుల పాటు విచారణ
- 1౦౦ కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఎసీబీ అంచనా
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): అవినీతి ఆరోపణలతో సస్పెండైన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌కుమార్‌ను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిఖేశ్‌ను విచారణ నిమిత్తం నాలుగు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం నిఖేశ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీకీ తీసుకొని విచారించనున్నారు.
నిఖేశ్ రూ.100 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టాడని ఏసీబీ అంచనా వేస్తోంది. విచారణలో నిఖేశ్ బినామీ ఆస్తులపై ఏసీబీ విచారించనుంది. అలాగే అతడి బ్యాంకు లాకర్లను తెరవనున్నట్టు సమాచారం.