హైదరాబాద్, జనవరి 12 : హైదరాబాద్ కేంద్రంగా కా ర్యకలాపాలు నిర్వహిస్తున్న ఎయిర్‌స్ట్రిప్ టెక్నాలజీ ప్రొవైడర్ ఏఈఏపీఎల్..రష్యా సం స్థ యూఏసీ టీసీ రష్యా (యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కా ర్పొరేషన్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆఫ్ రష్యా) కొలాబరేషన్‌తో దేశ వ్యాప్తంగా బీడీఏ (బిజినెస్ డెవలప్‌మెంట్ ఏరియాలు) సెంటర్లు నెలకొల్పందుకు భాగస్వాముల్ని ఆహ్వానించింది.
ఇందుకోసం ఒక్కో భాగస్వామి నుంచి రూ.100 కోట్ల పె ట్టుబడులు అవసరమని, దానితో దాదాపు 5 బీడీఏ సెంటర్లకు ఫైనాన్స్ చేయవచ్చని, ఈ సెంటర్లను నెలకొల్పే ప్రతీ కంపెనీలో తాము 51 శాతం భాగస్వామ్యం తీసుకుంటామని ఏఈఏపీఎల్ ఇండియా సీఎండీ మనీశ్ కపూర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటుచేసే బీడీఏ సెంటర్లకు ఎయిర్‌స్ట్రిప్ టెక్నాలజీని ఏఈఏపీఎల్ అందిస్తుందని, అటువంటి చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లకు ఉక్రెయిన్ తయారీ చిన్న స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను లీజుపై ఏఈఏపీఎల్ సమకూరుస్తుందని ప్రకటనలో వివరించారు.