హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహి స్తున్న ఏఈఏపీఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఏఈఏపీఎల్ ఎయిర్‌పోర్టులు కలిగిన భారత్ లేదా ప్రపంచంలో ఇతర దేశాల్లో స్థానిక ప్రభుత్వాల మద్దతుతో ఇంజిన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలో పలు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ సంస్థల్లో రష్యాకు చెందిన పెర్మ్ ఇంజిన్స్‌కు చెందిన పీడీ 14 ఇంజిన్లను తయారు చేసే యూనిట్ నెలకొల్పాలని ఏఈఏపీఎల్ గ్రూప్ కంపెనీల సీఎండీ మనీశ్ కపూర్ నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. ఈ ఇంజిన్ల తయారీ కోసం ఏఈఏపీఎల్ జాయింట్ వెంచర్ ప్రతిపాదనా ఒప్పందంపై రష్యా నగరం పెర్మ్‌లో పెర్మ్ ఇంజిన్స్ కేంద్ర కార్యాలయంలో సంతకాలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.