రాజేంద్రనగర్, జూలై 5: రాజేంద్రనగర్ సర్కిల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏఈ బలవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ప ట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ కేసు వివరాలు వెల్ల డించారు. 11వ వార్డు ఆదర్శనగర్‌లో సంతోష్‌నగర్‌కు చెందిన ముజఫరొద్దీన్ అనే కాంట్రాక్టర్ రూ.6.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు చేశారు. ఈ పనికి ఏఈ బలవంత్‌రెడ్డి బిల్లు మంజూరు చేయడానికి రూ.24 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.15 వేలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించాడు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఏసీబీ అధి కారులకు చేరవేశాడు. ఈ నేపథ్యంలో శుక్ర వారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏఈకి రూ. 15 వేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
అధికారులు జంప్
రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ దాడుల విషయం తెలియడంతో అధికారులు చాలా మంది ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.