26-03-2025 12:00:00 AM
మంచిర్యాల, మార్చి 25 (విజయక్రాం తి): న్యాయవాదులకు రక్షణ కల్పించాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో అడ్వకేట్‌ను హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని, అదేవిధంగా అడ్వకేట్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బార్ అసోసియేషన్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ రాజు, స్వామి, జగన్, మురళి, డేగ రవి, రంగు మల్లేష్, తులా ఆంజనేయులు, శేఖర్, కిరణ్, గోపతి రవి, తదితరులు పాల్గొన్నారు.