27-04-2025 12:00:00 AM
చేవెళ్ల, ఏప్రిల్ 26: జమ్ము కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా శనివారం చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీని వాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగంణం నుంచి ప్రధాన రహదారుల్లో జరిగిన ఈ ర్యాలీలో సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముందుగా ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ‘ భారత్ మాతా కీ జై.. పాకిస్తాన్ డౌన్ డౌన్..’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అమాయక ప్రజలపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి అమానుష సంఘటనలను అంతర్జాతీయ స్థాయిలో గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జనరల్ సెక్రటరీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి భారత పౌ రుడూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు రమే ష్, ప్రీతి, అనిల్, నళిని, సతీష్ పాల్గొన్నారు.