07-03-2025 01:10:22 AM
మంచిర్యాల, మార్చి 6 (విజయక్రాంతి) : బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల బార్ అసోసియేషన్ హాల్ లో న్యాయవాదులు సంబరాలు జరుపుకున్నారు. బిజెపి పట్టభద్రుడా ఎమ్మెల్సీగా అంజి రెడ్డి గెలిచిన సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ ప్రధాన కార్యదర్శి తులా ఆంజనేయులు, అధ్యక్షులు జగన్, డేగ రవి, కిషన్, నరేందర్, శేఖర్, సాగర్, సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.