హైదరాబాద్/సిద్దిపేట, జూలై 11 (విజయక్రాంతి): ఒక కేసులో నిందితులకు అనుకూ లంగా కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వుల ప్రతిని ఇచ్చేందుకు వెళ్లిన అడ్వొకేట్‌పై సిద్దిపేట పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీతో సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది రవికుమార్‌పై ఏఎస్‌ఐ ఉమారెడ్డి దాడి చేయించారంటూ గురువారం హైకోర్టు వద్ద లాయర్లు నిరసన నిర్వహించారు. న్యాయవాదిపై దాడి చేయడం హేయమంటూ గురు వారం హైకోర్టు అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మండిపడ్డారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు రవీందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితుడిపై దాడిని ప్రశ్నించిన పాపానికి లాయర్ ఫోన్ లాక్కోవడమే కాకుం డా దానిని ధ్వంసం చేశారన్నారు. అంతేకాకుండా దాడి చేసిన పోలీసులే తిరిగి తమ విధులను అడ్డుకున్నారంటూ న్యాయవాదిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డీజీపీని డిమాండ్‌చేశారు. లాయర్‌పై దాడి చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నా రు. ఏఎస్‌ఐతోపాటు ఈ దాడిలో పాల్గొన్న పోలీసులందరినీ సస్పెండ్ చేయాలన్నారు. ఉమారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, న్యాయవాదిపై ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకో వాలని కోరారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెం ట్ దీప్తి, సెక్రటరీలు శాంతిభూషన్ ఉప్పల, సంజీవ్, జాయింట్ సెక్రటరీ నవీన్, న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఐపై విచారణకు ఆదేశం
సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్‌పై విచారణకు ఆదేశించినట్లు సీపీ డాక్టర్ అనురాధ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయవాది రవికుమార్‌పై దాడికి సంబంధించి ఏఎస్‌ఐ ఉమారెడ్డిని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేసి, సీఐ ఉపేందర్‌పై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.