17-04-2025 12:05:05 AM
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి,
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 16 (విజయక్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి పథకంపై రైతుల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తామని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో భూ భారతి చట్టంపై, రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, అధికారులకు సూచించారు.