నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ స్వీయ దర్శకత్వంలో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘సుబ్రహ్మణ్య’ పేరుతో తెరకెక్కించనున్న ఈ సినిమాను ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌గా నిర్మిస్తున్నారు. మూవీకి సంబంధించి తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో మేకర్స్ ‘సుబ్రహ్మణ్య’ మూవీ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. అద్వయ్ విషపూరిత పాముల బావిలోకి దూకి పురాతన పుస్తకాన్ని తీసుకురావడం సాహసోపేతమైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.