calender_icon.png 14 March, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రపంచంలో సాహసాలు

11-03-2025 12:00:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ మరో సినిమా ప్రారంభిం చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. స్కై బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘ఐబీ 71’, వాటర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఘాజీ’, స్పెస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘అంతరిక్షం’ చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు ఈ తాజాచిత్రంతో మరో సరికొత్త టెరిటరీలోకి అడుగుపెడుతున్నారు.

ఈ ప్రాజెక్టులో ఫైర్ ఎలిమెంట్‌ను ఎక్స్‌ఫ్లోర్ చేయనున్నారాయన. భారతీయ చరిత్రలో ఓ కీలకమైన సంఘటనను విజువల్ వండర్‌గా ప్రజెంట్ చేయనున్నారు దర్శకుడు. 7వ శతాబ్దంలో చోటుచేసుకున్న ఒక ముఖ్యమైన, ఇంకా చరిత్రకెక్కని ఓ సంఘటనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఇందులో గోపీచంద్ ఇంతకుముందు ఎన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

పవన్‌కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. లాంచింగ్ ఈవెంట్‌కు కోర్ టీమ్‌తోపాటు పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. హిట్1, హిట్2, గీతగోవిందం, సైంధవ్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన మణికంధన్ ఎస్ ఈ చిత్రానికి డీవోపీ కాగా, చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.