calender_icon.png 28 October, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహస పర్యాటకం

28-10-2024 02:39:14 AM

  1. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్ల ఏర్పాటుకు శ్రీకారం
  2. పర్యాటకులను ఆకర్షించడంపై ఫోకస్
  3. 34 చెరువులు, రిజర్వాయర్లను గుర్తించిన టూరిజం కార్పొరేషన్
  4. పీపీపీ మోడ్‌లో నిర్వహించాలని నిర్ణయం
  5. టెండర్లు పిలిచిన పర్యాటక శాఖ

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక రంగానికి మరి న్ని సొబగులు అద్దేందుకు రాష్ట్ర టూరిజం శా ఖ ప్రయత్నిస్తోంది. స్థానిక టూరిస్టులనే కా కుండా, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ టూరిజం డెవలప్ మెంట కార్పొరేషన్ పని చేస్తోంది.

ఇందులో భాగంగానే వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రముఖ చెరువులు, రిజర్వాయర్లలో సాహస క్రీడలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 చె రువు లు, రిజర్వాయర్లను టీజీటీడీసీ ఎంపిక చేసిం ది.

అడ్వంచర్ వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్ల నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్షిప్ షిప్(పీపీపీ) మోడ్‌లో నిర్వహించేందుకు సిద్ధమైం ది. ఈ మేరకు ఆసక్తి ఉన్న ప్రైవేట్ ఎజెన్సీల నుంచి టీజీటీడీసీ దరఖాస్తులను ఆహ్వాని స్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29వ తేదీన బిడ్‌లు దాఖ లు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలోని కొన్ని చోట్ల బోట్ షికారు లాంటి సౌకర్యాలు ఉన్నా.. పూర్తిస్థాయిలో అడ్వంచర్ వాట ర్ స్పోర్ట్స్ ఎక్కడా లేవు. దీంతో నీ టిలో సాహస క్రీడలపై ఉన్న మోజుతో రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువ త అభిరుచులకు తగ్గట్టుగా థ్రిల్ కలిగించేందుకు వాటర్ స్కూటర్, సెల్ఫ్ డ్రైవ్, స్కయిం గ్, జిప్సీ బోట్, రాకెట్, పారాసెయిలింగ్ బోట్ లాంటి 11 యాక్టివిటీలను నిర్వహించేందుకు టీజీటీడీసీ సిద్ధమ వుతోంది.

బాధ్యతంతా వాళ్లదే..

అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్ల నిర్వహణ మొత్తాన్ని ప్రైవేట్ ఎజెన్సీలే చూ సుకోనున్నాయి. ప్రభుత్వంతో ఒప్పం దం కుదిరిన మొదటి మూడు నెల్లలోనే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఐదేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం ఈ టెండర్లను ఆహ్వానిస్తోంది.

ఒప్పందం ప్రకారం వచ్చిన ఆదాయంలో ప్రభుత్వం ఆయా ఏజెన్సీలకు షేర్ ఇవ్వనుంది. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్‌లో వినియోగించే లైఫ్ జాకెట్లు, హెల్మెట్లను ప్రైవేట్ ఏజెన్సీలే సమకూర్చాల్సి ఉంటుంది.  అ డ్వెంచర్ సమయంలో ప్ర మాదం జరిగితే ఆ బాధ్యత సదరు ఏజెన్సీనే తీసుకోవాల్సి ఉంటుంది.

గోవానే టాప్..

గోవా, ఉత్తరాఖండ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు అందిస్తున్న అడ్వెంచర్ వాటర్ స్పో ర్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నా యి. దీని పరంగా గోవా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. గోవాకు వెళ్లిన పర్యాటకు ల్లో ఎక్కువ మంది స్కూబా డైవింగ్ చేయడంపై ఆకస్తి కనబరుస్తారు.

అండమాన్ నికో బార్, కర్ణాకటలోని మురుదేశ్వర్, ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని గంగానది, కొలాడ్‌లోని కుండళీక నది ప్రదేశాలు కూడా నీటిలో సాహస క్రీడలకు ప్రఖ్యాతి చెందాయి. వీటి స్ఫూర్తితోనే పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాహస పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించింది. 

అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ కోసం ఎంపిక చేసిన 

చెరువులు/రిజర్వాయర్లు

హుస్సెన్ సాగర్ హైదరాబాద్

కోటిలింగాల జగిత్యాల

మద్దెలచెరువు (కోరుట్ల) జగిత్యాల

రామప్ప జయశంకర్  భూపాలపల్లి

ఎల్‌ఎండీ కరీంనగర్ కరీంనగర్

లకారం ఖమ్మం

మధిర ఖమ్మం

పెద్దచెరువు మహబూబ్‌నగర్

సోమశీల నాగర్ కర్నూల్

పందిళ్లపల్లి నల్లగొండ

నాగార్జున సాగర్ (కృష్ణ రివర్) నల్లగొండ

కడెం నిర్మల్

అలిసాగర్ నిజామాబాద్

ఎల్లమ్మ గుండమ్మ పెద్దపల్లి

గోదావరి ఖని పెద్దపల్లి

దుర్గం చెరువు రంగారెడ్డి

సరూర్ నగర్ రంగారెడ్డి

మహబూబ్‌సాగర్ సంగారెడ్డి

కోమటి చెరువు సిద్ధిపేట

భద్రకాళి రంగల్

సద్దుల చెరువు సూర్యాపేట

సింగోటం నాగర్ కర్నూల్

శ్రీరంగపురం వనపర్తి

సర్పనపల్లి వికారాబాద్

లక్నాపూర్ చెరువు వికారాబాద్

కోటిపల్లి వికారాబాద్

గచ్చిబౌలి మల్కం చెరువు రంగారెడ్డి

శామీర్‌పేట రంగారెడ్డి

ఎదులాబాద్, ఘట్కేసర్ మేడ్చల్

కేసరి సముద్రం నాగర్ కర్నూల్

కొండపోచమ్మ సిద్దిపేట

రంగనాయక సాగర్ సిద్దిపేట

హౌస్ బోట్ కోసం ఎంపిక చేసినవి..

నాగార్జున సాగర్ నల్లగొండ

బుద్ధవనం నల్లగొండ