calender_icon.png 11 March, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు

11-03-2025 12:00:00 AM

వనపర్తి టౌన్, మార్చి 10 : జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు అందచేయడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్లు,ప్రింటర్లు వివిధ  అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను జిల్లాలో అన్ని పోలీస్టేషన్ల పోలీసు అధికారులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా లో శాంతిభద్రతలను కాపాడే పోలీసు శాఖలో జిల్లాలోని అన్ని గ్రామాల అన్ని విభాగాల సమాచారం అందుబాటులో ఉండాల్సి ఉంటుందని జిల్లా, మండల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు నేర సంబంధితమైన విషయాలు భద్ర పరచడానికి సులభంగా తెలుసుకోవడానికి సంబంధిత విషయాలను డాటాను పై అధికారులకు తెలియపరచడానికి వీలుగా ఈ కంప్యూటర్లు ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డి ఎస్పీ ఇన్చార్జ్ అదనపు ఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాం ఎస్సు శివకుమార్, జిల్లా  కార్యాలయం స్టోర్ సిబ్బంది, సుదర్శన్, భరత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.