calender_icon.png 11 February, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తా...

11-02-2025 07:44:41 PM

కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్...

ఎల్బీనగర్: ప్రజలు ఆశీస్సులతో డివిజన్ అభివృద్ధిలో ముందుకు వెళ్తానని కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ అన్నారు.‌ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మంగళవారం కార్పొరేటర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, నాయకులు కార్పొరేటర్ ను సన్మానించారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ... కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ గా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు, నాయకుల సహకారంతో కొత్తపేట డివిజన్ ను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.