calender_icon.png 15 November, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు సమాచారం ఇవ్వాలి..

13-11-2024 02:55:20 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కుటుంబ సర్వేకు వెళ్ళే ముందు ఎన్యుమరేటర్లు ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణం19వ వార్డులోని మరాఠీ కృష్ణయ్య ఇంటి దగ్గర జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయ్యింది, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. వారి వెంట ఆర్డిఓ బన్సీ లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తాహసిల్దార్ విష్ణువర్ధన్ రావు తదితరులు ఉన్నారు.