30-03-2025 10:19:41 PM
బైంసా (విజయక్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్, భైంసాలోని ఈద్గాల వద్ద పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తుల భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం భైంసా, నిర్మల్ లోని ఈద్గాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రార్థన స్థలాలు మందిరాలు, ప్రధాన కూడళ్ళు వద్ద పికెట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 350 మంది పోలీసులు అధికారులతో పటిష్ట బందోబస్తులో ఉన్నారని చెప్పారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సంబధిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. సోమవారం ప్రార్థన సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. వాహనాల కోసం తగినంత పార్కింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశామన్నారు.