కరీంనగర్ సిటీ, డిసెంబర్23: తెలంగాణ రాష్ర్టంలో విద్యావ్యవస్థ పై రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం మూలంగా సమీక్షలు లేక గందరగోళ పరిస్థితిలో విద్యారంగం ఉందని, రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న సమస్యలు పరిష్కారం కావడంలేదని, రాష్ర్టంలో విద్య రంగానికి సంబంధించి ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, వచ్చే విద్యా సంవత్సరం ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సిఎం రేవంత్ రెడ్డి వెంటనే విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్ నగరంలోని స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ గత సంవత్సరం నుంచి ఉన్న విద్యా వ్యవస్థ పై సీఎం సమీక్షలు లేకుండా పోయాయని, ఓవైపు ప్రభుత్వ గురుకు లాలు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు జరుగుతున్నయా ని, శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామారాపు వెంకటేష్,మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్,నగర నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ, శ్రావణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.