calender_icon.png 16 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగడువట్టినట్టు అదుముకుంటడే..

08-08-2024 02:26:22 AM

‘గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే.. ఇంక నాతో ఉంటడే.. నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే.. నీకు గులామైతిలే..’ అంటూ రాకీతో రొమాన్స్‌కు సై అంటోంది అతని మేనమరదలు. ‘పైట జారకుండ పిన్నీసైతనంటడే.. రైకను ఊరించ హుక్కులుంటడే..’ అంటూ తన బావ మీద ఉన్న ఘాటు ప్రేమను వ్యక్తం చేస్తోంది! ఎవరీ మరదలు పిల్లా..? బావ కోసం అంతలా పరితపిస్తోందే..? అనుకుంటున్నారా! ‘మెకానిక్ రాకీ’ చిత్రం కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన పాట పంక్తులివీ. ఈ ఫోక్ సాంగ్‌కు జేక్స్ బెజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా యువ గాయని మంగ్లీ పాడారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రమే ‘మెకానిక్ రాకీ’. ఈ మూవీ నుంచి ‘గుల్లేడు గుల్లేడు..’ అనే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు.

ఈ పాటలో తనను నిర్లక్ష్యం చేస్తున్న బావ విశ్వక్‌ను ‘ముదురు బెండకాయ’ అంటూ, ‘అగడువట్టినట్టు అదుముకుంటడ’ంటూ మేనమరదలు మీనాక్షి తిట్టీ తిట్టనట్టుగా ఓ వేడుకలో అందరికీ తెలిసేలా బావ మీద ప్రేమనంతా ఒలకబోస్తోంది. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించగా, రామ్ తాళ్లూరి నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది. మరోవైపు విశ్వక్ సేన్ తన నెక్స్ లైనప్ సినిమాలకు సంబంధించిన ప్రకటనలతో అందరిలో ఆసక్తిని పెంచుతున్నారు. విశ్వక్ సేన్ బుధవారం తన 14వ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరు స్తుండగా, సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీకి సంబధించి మరిన్ని అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో తెలిజేయనున్నారు.