calender_icon.png 25 April, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజులకే కల్తీ కల్లు దుకాణాలు ఓపెన్

25-04-2025 01:02:05 AM

  1. ఎలాంటి చర్యలు లేకుండానే మళ్ళీ విక్రయాలు
  2. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు

కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి), ఒకవైపు ప్రభుత్వం కల్తీకల్లు, డ్రగ్స్, గంజా ఈ వంటి మత్తు పదార్థాలను నిషేధించాలని ప్రయత్నం చేస్తుంటే మరోవైపు నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు అనుమతి లేని కల్తీ కల్లు దుకాణాలను మూసివేసిన అధికారులు మూడు రోజులకే మళ్ళీ తెరిపించారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు, అనుమతి లేని దుకాణాల లో విక్రయాలు చేపడుతున్నారు.

పేరు కు టి ఎఫ్ టిలైసెన్స్ తీసుకొని అనుమతి లేకుండా ఎక్సైజ్ అధికారులతో కుమ్మ క్కై దుకాణాలను తెరిచారు. కల్తీ కల్లును అరి కట్టాలని, అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ అధికారులతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టి ఎఫ్ టి లైసెన్స్ పొందిన వారు కల్లు మూస్తే దారుల కు ఏడాదికి డబ్బులు ఒకేసారి తీసుకొని అమ్ముకునేందుకు అవకాశం కల్పించా రు.

ముస్తేదారులు లక్షల రూపాయలు అర్రస్ పాడి దక్కించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కల్లు దుకాణాలను నడిపి స్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం నెలసరి మా మూల్లా కు అలవాటు పడి కల్లు మూస్తే దారులతో కుమ్మక్కై దర్జాగా కల్తీకల్లు ను యదేచ్చగా విక్రయించడంతో ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ ంలోని నస్రుల్లాబాద్ మండలం పరిధి లోని అంకుల్ అంకుల్ తండా దుర్గి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో కల్తీ కళ్ళు సేవించి 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

మరుసటి రోజే ఎల్లారెడ్డి ని యో జకవర్గంలోని గాంధారి మండలం గౌరారం గ్రామంలో కల్తీ కల్లు సేవించి30 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిం దే. దీంతో ప్రభుత్వం సీరియస్ కావడంతోపాటు ఎక్సైజ్ అధికారులను అనుమతి లేని కల్తీకల్లు దుకాణాలను గుర్తించి అమ్మకాలు బంద్ చేయించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో హడావిడిగా ఎక్సైజ్ అధికారులు అనుమతి లేని కల్తీకల్లు దుకాణాలను బందు చేయడమే కాకుండా అల్ఫజోలం వంటి మత్తు పదార్థాలను కల్తీ కల్లులు కల్పవద్దని లేకుంటే డ్రగ్స్ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కళ్ళు డ్రగ్స్ వంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వాల్ పోస్టర్లను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఎక్సైజ్ అధికారులు ప్రతి గ్రామంలో కల్తీకల్లు తాగవద్దని మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని పోస్టల్లలో వివరిస్తూ ప్రధాన చౌరస్తాల్లో గోడలకు అతికించారు. అంత హడావిడిగా చేసిన ఎక్సైజ్ అధికారులు పోలీసులు, రెవిన్యూ, గ్రామ మహిళా సమాఖ్య లతో డ్రగ్స్ కల్తీ క ల్లు నియంత్రణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం రోజులు గడపకు ముందే మళ్ళీ కల్తీ కల్లు దుకాణాలు తెరిచారు. కల్తీ కల్లు నియంత్రించాలని ప్రభు త్వం పగడ్బందీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అనుమతి లేని దుకాణాలను కల్తీ కల్లు విక్రయాలపై ఉక్కు పాదం మోపెందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

దీంతో కల్లు మూస్తే దారులు ఆందోళనకు గురయ్యారు. లక్షలు పెట్టి దక్కించుకున్న కల్లుమాముల మూసివే వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తాము కోట్లలో నష్టపోవడమే కాకుం డా ఎంతో మంది ఉపాధి కోల్పోతారని ప్రజలు కల్తీ కల్లుకు హడాల్టు అయినవారు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తారని దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ చెప్పి మళ్ళీ కల్తీకల్లు విక్రయాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ముస్తే దారులు గ్రీన్ సిగ్నల్ పొందినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

మూడు నాలుగు రోజులు మూసివేసి అనుమతి లేని దుకాణాలను కల్తీ క ల్లు ను విక్రయిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లును నియంత్రించాలని కోరుతున్నారు. లైసెన్స్ లేని దుకాణాలను మూసివేయాలని కోరుతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  కల్తీ కల్లు అమ్మకాలు విక్రయాలు చేపడుతున్నారు. 

ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదా...

ప్రతిరోజు పేద,మధ్యతరగతి ప్రజలు పొద్దస్తమానం కష్టపడి సాయంత్రం వేళలో క ల్లు సేవించి సేద తీరాలని భావించే వారికి కల్తీ కల్లు ప్రాణాలను హరిస్తుంది. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. పేద ప్రజల ప్రాణాలు పోయిన ప్రభుత్వానికి పట్టింపు లేదా అని గ్రామాల్లోని పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కల్తీ లేని క ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వారం రోజులు కాకముందే అనుమతి లేని కల్తీకల్లు దుకాణాలను మళ్లీ తెరవడం గ్రామాలలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ పేరు చెప్పి క ల్లు మూస్తే దారులు తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

కల్తీ కల్లు తాగా వ్యక్తి మృతి 

కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కల్తీ కల్లు సేవించి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా సరంపల్లి గ్రామానికి చెందిన చిన్న బాల్ రాజు (45) కురోజు కల్లు తాగే అలవాటు ఉంది.  కల్లు సేవించడం  ఎక్కువైతే అతని స్నేహితులు ఇంటి  వద్ద వదిలేసి వెళ్తుంటా రని గ్రామస్తులు తెలిపారు.

ఎప్పటిలాగే బుధవారం రాత్రి కూడా కళ్ళు ఎక్కువ తాగడంతో స్నేహితులు ఇంటి వద్ద వదిలేసి వెళ్లినట్టుగా తెలిసింది. అప్పటికే ఆ వ్యక్తి ఉన్నఫలంగా అపస్మారక  స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా  మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పాటు కల్తీ కల్లు సేవించడం ఎక్కువై కింద పడడంతో గాయాలు అయ్యాయా లేక ఎవరైనా దాడి  చేశారేమోనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లిపోలీసుల కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  బాల్ రాజు మృతి చెందడం కలకలం రేపుతుంది. కల్తీ కల్లు ఎక్కువ కావడం వల్లే కింద పడి మృతి చెందుతే కల్లు మూస్తే దారులు కుటుంబ సభ్యులతో మధ్యవర్తులతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.

సరం పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. అందరితో కలుపుగోలుగా ఉండే బాలరాజు మృతి చెందడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కల్లు ఎక్కువగా సేవించడం వల్లనే కిందపడి మృతి చెందినట్లు గ్రామస్తులు వాపోతున్నారు.