calender_icon.png 25 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీ కల్లు దందా

25-02-2025 12:58:10 AM

  • ప్రజల ప్రాణలతో చెలగాటం మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
  • నిబంధనలు తుంగలో తొక్కి కల్తీ కల్లు దందా నిర్వహణ 

కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అడ్డదిడ్డంగా కల్తీ కల్లును తయారుచేసి కల్లు ప్రియులకు అమ్మకాలు చేపడుతున్నారు. అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కల్తీ కల్లును జోరుగా విక్రయిస్తున్నారు.

కొంతమంది నిజాయితీగా చెట్ల వద్ద గీత కార్మికులు కల్లు గీసి అమ్ముతుండగా కల్లు మూస్తే దారులుగా అవతారమెత్తి మత్తు పదార్థాలను కల్లు లో కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తుకు జోగుతున్నారు. కొంతమందిని కామారెడ్డి జిల్లా కేంద్ర పట్టణ శివార్లలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు.

కల్లు ను  విక్రయించుకోవడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు లైసెన్సులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి కళ్ళు ముస్తదారులు వారికి వ్యాపారం జోరుగా జరిగే ప్రదేశాలలో కల్లు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు లైసెన్స్ జారీ చేసి ముందు ఎక్కడ ఏ స్థలంలో కల్లు దుకాణం ఉండే ప్రదేశంలోని ప్రాంతాల్ని గుర్తించి నలువైపులా సరిహద్దులను నిర్ణయించి లైసెన్సు జారీ చేస్తారు. కల్లు ముస్తా దారులు ఈ లైసెన్స్ ను అడ్డం పెట్టుకొని రద్దీ ప్రదేశాల్లో కల్లు విక్రయాలు జరుపుతున్నారు.

కామారెడ్డి మండలం ఉగ్రవాయి  మైసమ్మ వద్ద కల్లు విక్రయించడానికి అనుమతి లేకున్నా ఉగ్రవాయి గ్రామంలో లైసెన్స్ తీసుకొని మైసమ్మ, ఎల్లమ్మ,పెద్దమ్మ దేవాలయాలు ఉన్న రద్దీ ప్రదేశంలో విచ్చలవిడిగా కల్తీ  కల్లు విక్రయాలు జరుపుతున్నారు.  ఎక్సైజ్ 34 A యాక్ట్ ప్రకారం లైసెన్స్ లో చూపించిన ప్రదేశంలో కల్లు విక్రయించాలి.

కానీ లైసెన్స్ లో చూయించిన ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశంలో కల్లు విక్రయించడం చట్ట ప్రకారం నేరం. వెంటనే ఎక్సైజ్ అధికారులు చట్ట పరిధిలో కేసు నమోదు చేసి దేవాలయాల వద్ద ఉన్న  కల్తీ కల్లు దుకాణాన్ని తొలగించాలని గ్రామస్తులు, యువకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కల్తీ కళ్ళు శాంపిల్స్ ను సేకరించి కేసు నమోదు చేయాలని సేకరించిన శాంపిల్స్ ను పరిశోధన కోసం ప్రభుత్వ ల్యాబ్ కు పంపించాలని ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తక్షణమే కల్తీ కల్లు దుకాణాన్ని ఎత్తివేయకుంటే జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్,నార్కో డ్రగ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. స్వచ్ఛమైన కల్లు పేరిట కల్తీకల్లును విక్రయిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

భక్తి కోసం దేవాలయానికి వచ్చే భక్తులు ఎల్లమ్మ ,మైసమ్మ ,పెద్దమ్మ, దేవాలయాలను దర్శించుకున్న అనంతరం కల్తీకల్లు కనపడుతుండడంతో దైవదృష్టి అనంతరం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిని కల్లును సేవించాలనే ఆలోచనలు రేకెత్తిస్తుండడంతో దేవాలయాలకు వచ్చిన భక్తులు కల్తీకల్లు సేవించి అక్కడే సేద తీర్చుకుంటున్నారు.

ప్రభుత్వ నిబంధన మేరకు కళ్ళు సీసా పరిమాణం ఎంత ఉందో బోర్డు పెట్టాల్సి ఉంది. కానీ ఎక్కడ బోర్డు పెట్టరు. ఇది చట్ట విరుద్ధం. అయినా ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ డంతో   లోపాయి  కారి ఒప్పందానికి నిదర్శనం అని పలువురు విమర్శిస్తున్నారు.

కల్లు సీసాలను కూడా ఏ ఒక్కరోజు శుభ్రం చేసిన దాఖలాలు ఉండవని ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి శాంపిల్స్ సేకరిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని గ్రామస్తులు అంటున్నారు. స్వచ్ఛమైన కల్లు పేరిట నీళ్లలో ఆల్ఫాజోమ్, సోపు చెక్క, బురుగు రావడానికి కుంకుడుకాయ రసం, పేస్ట్ వేసి కల్లు తయారు చేస్తారని ఆ గ్రామస్తులు తెలిపారు.

రోడ్ల పక్కన స్వచ్ఛమైన కళ్ళు పేరిట ప్లాస్టిక్ పేపర్లలో ప్లాస్టిక్ డబ్బాలలో కల్తీకల్లును విక్రయిస్తున్నారని దీనివలన ఆరోగ్యంగా ఉండే మానవులు కల్లుకు బానిసలై కండరాలు నాడీ వ్యవస్థ జ్ఞాపకశక్తి దెబ్బతిని మనిషి కళ్ళు సేవించనిదే బ్రతకలేని స్థాయికి దిగజారిపోతున్నారని పలు ఆరోపిస్తున్నారు.

మానవులను కల్లుకు బానిసలుగా తయారు చేసుకునే విధంగా విక్రయదారులు కల్తీ కల్లు ను తయారు చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల వారి జీవితాలతో కల్లు ముస్తదారులు ఆడుకుంటున్నారని  యువకులు ఆరోపిస్తున్నారు.

కల్తీకల్లు విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకున్నా కల్లు మూస్తే దారుల ఒకరిద్దరి ప్రయోజనాల కోసం వారి ఆర్థిక జలసత్వాలు బలపడడం కోసం రోజు కూలీ నాలి పనులు చేసుకునే రోజు వారి కూలీలు వ్యవసాయ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు బీడీ కార్మికులు కల్తీ కల్లుకు బానిసలు అవుతున్నారన్నారు.

ల్తీ కల్లుకు అలవాటు పడ్డ వారు రెండు రోజులు కల్తీకలు సేవించనట్లయితే మానసిక రోగులుగా తయారవుతున్నారని నాడీ వ్యవస్థ మీద అల్ఫాజోలామ్ ప్రభావం చూపుతుండడంతో పిచ్చిపిచ్చిగా వింతగా ప్రవర్తించే దిగజారుడు స్థాయికి వెళ్తున్నారు.

కల్తీ కల్లు విక్రయించే ముస్తాదారు వారిని బానిసలుగా మార్చేశారని ఈ పరిణామం భవిష్యత్తులో మానవ మనుగడ ను ప్రశ్నార్థకంగా తయారు చేసే ప్రమాదం ఉందని  యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి కల్తీకల్లును అరికట్టాలని కోరుతున్నారు.