09-04-2025 02:07:18 AM
చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులు
పరామర్శించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్
కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు
కామారెడ్డి /బాన్సువాడ, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్ లు బాధితులను మంగళవారం పరామర్శించా రు. బాధితుల ఆరోగ్య పరిస్థితిలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్తీ కల్లు విక్రయించిన దుకాణాలను సీజ్ చేశారు.
కల్లు దుకాణాల నిర్వహాకులపై కేసులు నమోదు చేశారు. పొద్దంతా కష్టపడి కూలి నాలి చేసుకు నే బడుగు బలహీన పేద ప్రజలు సాయంత్రం వేళలో కల్లు సేవించి తాము పడిన కష్టాన్ని మరిచిపోయేందుకు సేద కల్లు సేవించి సేద తీరుతారు.
అమాయకుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని మత్తు మందు కలిపి కల్తీ కల్లు విక్రయాలు, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు అమాయకుల పేద ప్రజల అవకాశా న్ని ఆసరాగా చేసుకుని కల్తీ కల్లు అంటగాడుతున్నా రు. కల్తీ క ల్లు సేవిస్తున్న పేద ప్రజలు అమాయకులు కల్తీ కల్లుకు అడాప్ట్ అవుతున్నారు.
కల్లు సేవించిన తర్వాత వారు ఏమి చేస్తారో వారికే తెలియకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దాడులకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు కల్తీకల్లులో మద్యం కలుపుకొని సేవిస్తున్నారు. ఈ విషయాలన్నీ చూసిన వస్తే దారులు తమకు గిరాకి వస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
కల్లులో ఏ మేరకు మత్తు పదార్థాలు కలుపాలని విషయం కూడా తెలియకుండానే కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. కల్తీ కళ్ళు సేవించకుంటే గ్యాప్ ఏర్పడితే పిచ్చివారిగా వ్యవహరిస్తారు. బాన్సువాడ, నిజాంబాద్ ఆసుపత్రిలలో 80 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.