calender_icon.png 20 April, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు కలకలం

11-04-2025 12:00:00 AM

కార్మికులుగా బాల కార్మికులు

కామారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లోని మూడు గ్రామాలలో కల్తీకల్లు సేవించి 60 మందికి పైగా ఆసుపత్రుల పాలై ఇబ్బం దులకు గురైన సంఘటన అందరికీ తెలిసిందే అది మరువకముందే దోమకొండ మండలం ముత్యంపేట కల్లు డిపోలో కళ్ళు ను సరఫరా చేసే ఇద్దరు మైనర్ బాలురు అనుమానస్పద స్థితిలో కుంటలో పడి మృతి చెందడం పై తీవ్ర ఆగ్రాయ వేషాలు వ్యక్తమవుతున్నాయి.

ముత్యంపేట కల్లు డిపోలో కళ్ళు సరఫరా చేసే కుమార్ భూక్య సురేష్ లు మూడు రోజుల క్రితం కేశంపల్లి తండా కు చెందిన ఇంటి నుండి వెళ్లిన ఇరువురు బాలురు మూడు రోజులుగా ఇంటికి చేరుకోలేదు మూడు రోజుల తర్వాత గురువారం రాఘవపూర్ శివారులోని ఒక కుంటలో విగత జీవులుగా కనిపించారు బాలుర తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఇరు వురు బాలురు గత కొన్ని సంవత్సరాలుగా ముత్యంపేట కళ్ళు డిపోలో కళ్ళు సరఫరాకు కార్మికులుగా పనిచేస్తున్నారు. కళ్ళు గుత్తేదా రులు బాలుర మధ్య ఏమి జరిగి ఉంటుం దోనని బాలుర కుటుంబీకులు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు  ఈ కల్తీ కళ్ళు నిరోధానికి లాగే మైనర్ బాలురను కార్మికులుగా పనిచేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని యువకులు మేధావులు డిమాండ్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని కళ్ళు డిపోలు షాపులను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు