23-03-2025 03:16:44 PM
ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే ఊరుకోం
మున్సిపల్ సిబ్బంది హెచ్చరిక
ఆందోల్: ఆందోల్ జోగిపేట పురపాలక సంఘము పరిధిలోని మటన్ మార్కెట్ లో చనిపోయిన జీవలను వదిస్తున్నారన్న సమాచారం మేరకు మునిసిపల్ కమిషనర్ తిరుపతి ఆదేశాలతో నిఘా ఉంచి ఆదివారం తనికీలు నిర్వహించి కల్తీ మాంసన్ని సీజ్ చేశారు. దుకాణం దారులకు చిన్న వాటిని లేదా అనారోగ్యంతో వున్నవాటిని వదించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా మటన్ మార్కెట్ లో అనారోగ్యంతో కూడిన జీవాలను వధిస్తూ ప్రజా ఆరోగ్యానికి మాంసం విక్రయదారులు విఘాతం కలిగిస్తున్నారు. ఎంతోకాలంగా ఇక్కడ అపరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఈగలు దోమల స్వైర విహారం మధ్య కుళ్లిపోయిన మాంసాన్ని షాపు యజమానులు యదేచ్చగా విక్రయిస్తున్నారు. చనిపోయిన, అనారోగ్యం పాలైన, కాలం చెల్లిన జీవలను వధిస్తూ మాంసం ఈ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
అంతేకాకుండా మార్కెట్లో మాంసం అమ్మకాలు జరగకపోవడంతో ఆ మాంసాన్ని ఫ్రిజ్లో దాచి మరుసటి రోజు మార్కెట్లో విక్రయిస్తున్నారు. మార్కెట్లో షాపులు ఉన్నప్పటికీ మార్కెట్ బయట మురికి కాలువల పక్కన దుర్గంధ వాతావరణం లో లోపభూయిష్టమైన మాంసాన్ని విక్రయిస్తున్నారు. మాంస ప్రియులు గత్యంతరం లేక కుళ్ళిపోయిన మాంసాన్ని కొనుగోలు చేసి రోగాల పాలవుతున్నారు. నిర్దిష్టమైన ధర ప్రకటించకుండానే వారికి ఇష్టం వచ్చిన ధరలకు మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల జేబులని కొల్లగొడుతున్నారు షాపు యజమానులు. కొనుగోలు దారులనుంచి ఏవైనా పిర్యాదులు అందితే వికృయదారులపై చర్య తీసుకుంటామని మున్సిపల్ సిబ్బంది ప్రకటించారు. ఈ కార్యక్రమములో ఆర్ ఐ నారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, జూనియర్ అసిస్టెంట్ ఖాయమోద్దిన్ పాల్గొన్నారు.